AP : అప్పుడు వై నాట్ 175.. ఇప్పుడు 11 మిగిలాయి

AP : అప్పుడు వై నాట్ 175.. ఇప్పుడు 11 మిగిలాయి
X

‘వై నాట్ 175’.. ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే వైసీపీ అధినేత జగన్ ఈ స్లోగన్ అందుకున్నారు. 2019లో 151 సీట్లు గెలిచామని.. ఈసారి కుప్పంతో సహా రాష్ట్రంలోని 175కి 175 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కానీ రియాలిటీ జగన్ అంచనాలకు చాలా భిన్నంగా ఉంది. మొత్తం 175 సీట్లలో వైసీపీ కేవలం 11 స్థానాల్లోనే గెలిచింది. జగన్ ఆశించిన దాని కంటే ఫ్యాన్ పార్టీకి 164 సీట్లు తక్కువగా వచ్చాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ 8 ఉమ్మడి జిల్లాల్లో ఖాతానే తెరవలేదు. శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో, ప.గో, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులెవరూ గెలవలేదు. ఆయా జిల్లాలను కూటమి పార్టీలు ఊడ్చిపారేశాయి. కాగా వైసీపీ కేవలం 11 సీట్లే దక్కించుకుంది.

ఏపీ ఎన్నికలు ఫలితాలు వెలువడిన వేళ I-PAC టీమ్ వైఎస్ జగన్‌కి ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేసింది. ‘2024 AP ఎన్నికలు వైఎస్ఆర్సీపీతో మళ్లీ కలిసి పనిచేసేలా చేశాయి. I-PAC & దాని నిపుణులందరు కలిసి ఎన్నికల్లో గెలుపుకోసం కష్టపడ్డాం. ఫలితం ఎలా ఉన్నప్పటికీ వైఎస్ జగన్ నాయకత్వం అందరికీ స్ఫూర్తి. మాపై ఆయన నమ్మకం ఉంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని Xలో పోస్ట్ చేసింది.

Tags

Next Story