Road Accident : అమెరికాలో రోడ్డు ప్రమాదం స్టేషన్‌ఘన్‌పూర్ యువకుడు మృతి

స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్ పరిధిలోని శివునిపల్లి పట్టణానికి చెందిన యువకుడు పార్శి గౌతమ్ (19) శనివారం అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వ్యాపారి పార్శి కమల్‌కుమార్–పద్మ దంపతుల కుమారుడు గౌతమ్ ఇంటర్ పూర్తి కాగానే బీటెక్ చదివేందుకు ఏడాదిన్నర క్రితం అమెరికాలోని అరిజోనా రాష్ట్రానికి వెళ్లాడు. ప్రస్తుతం బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం శనివారం వీకెండ్ కావడంతో స్నేహితులతో కలిసి జలపాతం చూసేందుకు వెళ్లాడు. తిరిగి అరిజోనాలో తాను నివాసం ఉంటున్న ఇంటికి వెళుతున్న క్రమంలో వెనుకాల నుంచి వచ్చిన కారు వీరు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారు వెనుక సీట్లో కూర్చున్న గౌతమ్‌తో పాటు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన ముక్క నివేష్ అనే విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందారు. అరిజోనా పోలీసులు గౌతమ్ తండ్రి పార్శి కమల్‌కుమార్‌కు సమాచారం అందించారు. కాగా గౌతమ్ మృతదేహం అమెరికా నుంచి శివునిపల్లి పట్టణానికి రావడానికి మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com