Srisailam : శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు నేడు అంకురార్పణ

Srisailam : శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలకు నేడు అంకురార్పణ

శ్రీశైలంలో (Srisailam) నిర్వహించనున్న ఉగాది మహోత్సవాలకు నేడు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేయనున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడంతో కైలాసగిరి నిండిపోయింది. ఐదు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా రోజూ శ్రీభ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామికి విశేష వాహన సేవ నిర్వహిస్తారు.

కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుండి లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను సిద్దం చేసినట్లు ఈఓ డీ పెద్దిరాజు తెలిపారు. అదే విధంగా యాత్రికులు సేద తీరేందుకు చలువ పందిళ్లు, పార్కింగ్‌, శానిటేషన్‌, సూచికబోర్డులు, సాంస్కృతిక కార్యక్రమాలు, మంచినీటి సరఫరా, వైద్యసేవలు, అన్నప్రసాద వితరణ శిబిరాల వద్ద మోలిక వసతులు కల్పించి పర్యవేక్షిస్తున్నట్లు ఈఈ రామకృష్ణ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story