ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప జిల్లా ఓబులాపురం-గంగాదేవి గ్రామాల మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నైకి బళ్లారి నుంచి ఇనుప పైపుల లోడుతో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తా పడింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. డ్రైవర్, క్లీనర్ మృతి చెందారు. డ్రైవర్ మృతదేహం పొలాల్లో పడిపోగా.. క్లీనర్ మృతదేహం లారీలో ఇరుక్కుపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు.