తల్లికి వందనం పథకానికి ఏపీ ప్రభుత్వం ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. అయితే ప్రస్తుతానికి అది లేకపోయినా మరో పది పత్రాలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. చివరిగా ఆధార్ ను మాత్రం ఇవ్వాల్సిందే. ఈ పథకం ద్వారా రూ.16వేలు ప్రభుత్వం అందించనుంది.
దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం విడుదల చేసింది. జగన్ అమ్మ ఒడి పథకాన్ని తల్లికి వందనంగా టీడీపీ ప్రభుత్వం మార్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఆధార్ లేకపోతే నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు పాఠశాలలకు పిల్లలు పంపించే తల్లులు లేదా వారి సంరక్షకులకు ఏడాది రూ.15000 ఆర్థిక సాయం చేస్తారు.
దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి ఈ పథకం వర్తింపచేస్తారు.ఒకటో తరగతి నుండి ఇంటర్ విద్యార్థులకు ఆధార్ నెంబర్ పొందాలని ఆదేశాలు ఇచ్చింది. 75 శాతం హాజరు ఉన్నవారికే తల్లికి వందనం కింద సాయం లభిస్తుంది.