Arogyasri : ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సేవలు ఆపేస్తాం.. నెట్‌వర్క్ వార్నింగ్

Update: 2024-05-21 06:52 GMT

ఏపీలో ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవల్ని ఈనెల 22 నుంచి నిలిపివేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు అల్టిమేటం ఇచ్చాయి. ఈమేరకు -ఆరోగ్యశ్రీ సీఈఓ లక్ష్మీషాకు సోమవారం నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ లేఖ రాసింది. తాజా పరిణామాలు ఆరోగ్యశాఖలో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో తాము ఈనెల 2వ తేదీ నుంచే సేవలు నిలిపివేస్తామని చెబితే రూ.50 కోట్లు ఈహెచ్ఎస్ బకాయిలు చెల్లించారని, ఆరోగ్య శ్రీ బకాయిలు రూ.1,500 కోట్లు రావాల్సి ఉందన్నారు. బకాయిల చెల్లింపు కోసం పలు మార్లు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఈ క్రమంలో సేవల్ని నిలి పివేయడం తప్ప తాము చేయగలిగింది లేదని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు పేర్కొన్నాయి.

ఈ లేఖ ప్రతుల్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల కమిషన్ సీఈఓ, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి పంపినట్లు నెట్వర్క్ ఆస్పత్రుల అసోసియేషన్ తెలిపింది. తమకు చెల్లించాల్సిన 1,500 కోట్లు చెల్లించి సమస్యను పరిష్కరించాల్సిందిగా అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు.

Tags:    

Similar News