AB Venkateswara Rao: నా సస్పెన్షన్‌ను కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు: ఏబీ వెంకటేశ్వర రావు

AB Venkateswara Rao: ఏపీ చీఫ్‌ సెక్రటరీకి ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వర రావు లేఖ రాశారు.

Update: 2022-03-25 13:15 GMT

AB Venkateswara Rao: ఏపీ చీఫ్‌ సెక్రటరీకి ఇంటెలిజెన్స్‌ మాజీ చీప్‌ ఏబీ వెంకటేశ్వర రావు లేఖ రాశారు. తనను ఇంకా సస్పెన్షన్‌లో కొనసాగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని లేఖలో పేర్కొన్నారు. అన్ని వివరాలతో సీఎస్‌కు లెటర్‌ పంపించారు. ఫిబ్రవరి 8వ తేదీకి రెండేళ్లు పూర్తయిన కారణంగా... సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం తన సస్పెన్షన్‌ తొలగిపోయినట్లేనని తెలిపారు. కాబట్టిన తన సస్పెన్షన్‌ తొలగిపోయినట్లేనని... పూర్తి జీతం వెంటనే ఇవ్వాలని కోరారు.

2021 జులై 31న చివరిసారిగా తనపై సస్పెన్షన్‌ను పొడిగిస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని.. దాన్ని రహస్యంగా ఉంచి, జీవో కాపీలు కూడా తనకు ఇవ్వలేదన్నారు. రెండేళ్లకు మించి సస్పెన్షన్‌ కొనసాగించాలంటే కేంద్ర హోంశాఖ అనుమతి తప్పని సరి అని... కానీ గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదన్నారు. ఏమైనప్పటికీ తన సస్పెన్షన్‌ ముగిసినట్లేనని సీఎస్‌కు లేఖ ద్వారా తెలిపారు ఏబీ వెంకటేశ్వరరావు.

Tags:    

Similar News