Anand Mahindra : అరకు కాఫీతో ఆనంద్ మహీంద్రా కొత్త బ్రాంచ్

Update: 2024-07-03 06:58 GMT

ఆంధ్రప్రదేశ్ అరకు కాఫీ రుచి విశ్వవ్యాప్తం అవుతోంది. ఇప్పటికే పారిస్ వీధుల్లో అరకు కాఫీ అవుట్ లెట్ ఒకటి నడుస్తుండగా.. మరో కేఫేను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ( Anand Mahindra ) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా ట్వీటు రీట్వీట్ చేసిన చంద్రబాబు.. నిజంగా ఇది గొప్పవార్త అంటూ రాసుకొచ్చారు. అరకు కాఫీ లాంటి సక్సెస్ ఫుల్ స్టోరీలు ఏపీ నుంచి భవిష్యత్తులో మరిన్ని రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. అరకు లోయలో సేంద్రీయ పద్ధతుల్లో కాఫీని పండిస్తున్న గిరిజనుల కృషికి మద్దతుగా నిలుస్తున్న ప్రధాని మోదీకి ఆనంద్ మహీంద్రా ధన్యవాదాలు తెలిపారు.

అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచంలో ఫేమస్ బ్రాండ్ గా మారిందన్న ఆనంద్ మహీంద్రా.. ప్రపంచంలోని అత్యుత్తమ కాఫీలలో ఒకటిగా అరకు కాఫీ నిలిచిందన్నారు. గిరిజన రైతులను అరకు కాఫీని పండించేలా ప్రోత్సహించాలంటూ చంద్రబాబు అప్పట్లో సూచించారన్న ఆనంద్ మహీంద్రా.. చంద్రబాబు సూచనలతో డాక్టర్ రెడ్డితో కలిసి నాంది ఇండియాను ప్రారంభించామని ట్వీట్లో రాసుకొచ్చారు. అరకు కాఫీ ని గ్లోబల్ బ్రాండ్ గా మార్చేందుకు మరిన్ని స్టెప్స్ తీసుకుంటున్నామన్నారు.

Tags:    

Similar News