BPharm Student Suicide: బీ-ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో కొత్త కోణాలు..
BPharm Student Suicide:ఏపీలో సంచలనం రేపిన బీ-ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి;
BPharm Student Suicide: ఏపీలో సంచలనం రేపిన బీ-ఫార్మసీ విద్యార్థిని తేజస్విని మృతి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి.. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్లకు చెందిన తేజస్విని మృతికేసును దిశ పీఎస్‌కు అప్పగించారు.. రేప్ కేసుగా నమోదు చేసినట్లు ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ ప్రకటించారు.. కేసు దర్యాప్తు అధికారిగా దిశ డీఎస్పీ శ్రీనివాసులును నియమించారు.. కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని డీఎస్పీని ఆదేశించారు..
రెండు వారాల్లో దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని ఎస్పీ చెప్పారు.. ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ శ్రీనివాసులు ఇవాళ గోరంట్లలో విచారణ చేపట్టనున్నారు. గోరంట్లకు చెందిన తేజస్విని తిరుపతిలో బీ-ఫార్మసీ చదువుతోంది. మల్లాపల్లికి చెందిన సాధిక్.. ఆమెను ప్రేమించానని నమ్మించి స్నేహితులతో కలిసి గ్యాంగ్‌రేప్ చేశాడు. తర్వాత హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు.
తేజస్విని సూసైడ్ చేసుకుందని పోలీస్‌స్టేషన్‌కూ వెళ్లి పోలీసులకు చెప్పాడు. అయితే, ఈ కేసులో పోలీసులు వ్యవహరించిన తీరుపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి.. మృతదేహాన్ని రీపోస్టుమార్టం చేసిన పోలీసులు ఆమెది ఆత్మహత్య అని చెప్పడం కూడా విమర్శలు దారితీసింది.. పోలీసుల వ్యాఖ్యలపై తేజస్విని కుటుంబసభ్యులు, మహిళా సంఘాల నేతలు మండిపడ్డారు.
తన కూతురిని సాధిక్, అతని స్నేహితులు కలిసి గ్యాంగ్‌రేప్ చేసి హత్య చేసారని తేజస్విని తండ్రి గోపి ఆరోపించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే తిరుపతిలోనే చేసుకునేదని.. గోరంట్లకు వచ్చి సాధిక్ పొలంలోనే సూసైడ్ ఎందుకు చేసుకుంటుందని ప్రశ్నించారు. సాధిక్‌ను కాపాడేందుకే పోలీసులు ప్రయత్నిస్తున్నారని గోపి ఆరోపించారు. చివరకు పోలీసులు రేప్ కేసుగా నమోదు చేసి దిశ పీఎస్‌కు కేసు అప్పగించారు.