AP 10th Supplementary Hall Tickets : ఏపీ టెన్త్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు విడుదల
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయి. విద్యార్థులు https://www.bse.ap.gov.in/ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగనున్నాయి. మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఇప్పటికే బోర్డు విడుదల చేసింది.
ఏపీ టెన్త్ సప్లిమెంటరీ 2024 పరీక్షల టైం టేబుల్ ఇదే
మే 24, 2024: ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ 1
మే 25, 2024: సెకండ్ ల్యాంగ్వేజ్
మే 27, 2024: ఇంగ్లిష్
మే 28, 2024: మ్యాథమెటిక్స్
మే 29, 2024: ఫిజికల్ సైన్స్
మే 30, 2024: జీవ శాస్త్రం
మే 31, 2024: సోషల్ స్టడీస్
జూన్ 1, 2024: ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్ II, OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ I
జూన్ 3, 2024: OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ II, SSC ఒకేషనల్ కోర్సు
ఆంధ్రప్రదేశ్‌లోని 10వ తరగతి ఫలితాల్లో ఫెయిలైన విద్యార్ధులతోపాటు ఇంప్రూవ్‌మెంట్ రాయాలనుకునే విద్యార్ధులు కూడా సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన విద్యార్ధులు తదుపరి దశకు ప్రమోట్ అవుతారు.