AP: మా రాజీనామాలను ఆమోదించండి

మండలి ఛైర్మన్‌ను కలిసిన ఎమ్మెల్సీలు.. రాజీనామాలను ఆమోదించాలని వినతి.. మోషన్ రాజుకు ఆరుగురు ఎమ్మెల్సీల వినతి

Update: 2025-12-01 10:30 GMT

తమ రా­జీ­నా­మాల వ్య­వ­హా­రం­పై త్వ­ర­గా ని­ర్ణ­యం తీ­సు­కో­వా­ల­ని ఆరు­గు­రు ఎమ్మె­ల్సీ­లు ఏపీ శాసన మం­డ­లి ఛై­ర్మ­న్ మో­షె­న్ రా­జు­కు వి­జ్ఞ­ప్తి చే­శా­రు. వై­సీ­పీ­కి చెం­దిన ఎమ్మె­ల్సీ­లు గతం­లో రా­జీ­నా­మా చే­శా­రు. కానీ వారి రా­జీ­నా­మా­ల­ను మం­డ­లి ఛై­ర్మ­న్ ఆమో­దిం­చ­కుం­డా పెం­డిం­గ్ లో ఉం­చా­రు. రా­జీ­నా­మా­ల­ను పెం­డిం­గ్ లో ఉం­చ­డం­పై ఇప్ప­టి­కే ఎమ్మె­ల్సీ జయ­మం­గళ వెం­క­ట­ర­మణ హై­కో­ర్టు­ను ఆశ్ర­యిం­చా­రు. తన రా­జ­నా­మా లే­ఖ­పై తగిన ని­ర్ణ­యం తీ­సు­కు­ని ఉత్త­ర్వు­లు జారీ చే­సే­లా మం­డ­లి ఛై­ర్మ­న్ ఆదే­శిం­చా­ల­ని కో­రు­తూ పి­టి­ష­న్ దా­ఖ­లు చే­శా­రు. దీ­ని­పై వి­చా­రణ చే­ప­ట్టిన హై­కో­ర్టు.. తా­జా­గా రా­జీ­నా­మా­పై 4 వా­రా­ల్లో­గా ని­ర్ణ­యం తీ­సు­కో­వా­ల­ని ఆదే­శిం­చిం­ది. ఆ ఆర్డ­ర్ కా­పీ­ని జయ­మం­గళ.. మం­డ­లి ఛై­ర్మ­న్ కు అం­దిం­చా­రు. వై­సీ­పీ నుం­చి ఎమ్మె­ల్సీ­గా గె­లి­చి.. కూ­ట­మి ప్ర­భు­త్వం­లో ఎమ్మె­ల్సీ­గా కొ­న­సా­గ­లే­న­ని, వి­లు­వ­ల­తో కూ­డిన రా­జ­కీ­యా­లు చే­యా­ల­ను­కుం­టు­న్నా కా­బ­ట్టే రా­జీ­నా­మా ఆమో­దిం­చా­ల­ని కో­రు­తు­న్న­ట్లు తె­లి­పా­రు. మి­గ­తా ఐదు­గు­రు ఎమ్మె­ల్సీ­లు పో­తుల సు­నీత, కర్రి పద్మ­శ్రీ, బల్లి కల్యా­ణ్ చక్ర­వ­ర్తి, జా­కి­యా ఖానం, మర్రి రా­జ­శే­ఖ­ర్ లు సైతం వై­సీ­పీ నుం­చి గె­లి­చి కూ­ట­మి ప్ర­భు­త్వం ఎమ్మె­ల్సీ­లు­గా కొ­న­సా­గ­లే­మ­ని తే­ల్చి చె­ప్పా­రు. తమ రా­జీ­నా­మా­ల­ను ఆమో­దిం­చా­ల­ని కో­రా­రు.

పెండింగ్‌లో రాజీనామాలు

తన రా­జీ­నా­మా­ను ఛై­ర్మ­న్ ఆమో­దిం­చ­కుం­డా జా­ప్యం చే­స్తు­న్నా­రం­టూ జయ­మం­గళ హై­కో­ర్టు­ను ఆశ్ర­యిం­చా­రు. రా­జీ­నా­మా­పై 4 వా­రా­ల్లో ని­ర్ణ­యం వె­ల్ల­డిం­చా­ల­ని మం­డ­లి చై­ర్మ­న్​­ను హై­కో­ర్టు ఆదే­శిం­చిం­ది. దీం­తో జయ­మం­గళ వెం­కట రమణ శా­స­న­మం­డ­లి చై­ర్మ­న్​­ను కలి­సి హై­కో­ర్టు కాపీ అం­ద­జే­శా­రు. జయ­మం­గ­ళ­తో పాటు మొ­త్తం ఆరు­గు­రు ఎమ్మె­ల్సీల రా­జీ­నా­మా­లు మం­డ­లి ఛై­ర్మ­న్ వద్ద పెం­డిం­గ్​­లో ఉన్నా­యి. డి­ప్యూ­టీ చైర్ పర్శ­న్ జా­కీ­యా ఖా­న­మ్, పో­తుల సు­నీత, బల్లి కళ్యా­ణ్ చక్ర­వ­ర్తి, కర్రి పద్మ­శ్రీ, మర్రి రా­జ­శే­ఖ­ర్ రా­జీ­నా­మా­లు మం­డ­లి ఛై­ర్మ­న్ వద్ద పెం­డిం­గ్​­లో ఉన్నా­యి. నె­ల­లు తర­బ­డి ఆరు­గు­రు ఎమ్మె­ల్సీ­లు రా­జీ­నా­మా­లు చై­ర్మ­న్ వద్ద పెం­డిం­గ్​­లో­నే ఉన్నా­యి. పలు­మా­ర్లు స్వ­యం­గా ఛై­ర్మ­న్​­ని కలి­సి ఆమో­దిం­చా­ల­ని కో­రి­నా ఇం­త­వ­ర­కూ ని­ర్ణ­యం తీ­సు­కో­లే­దు. ఇవాళ జయ­మం­గ­ళ­తో పాటు మి­గి­లిన అయి­దు­గు­రు ఎమ్మె­ల్సీ­లు ఛై­ర్మ­న్​­ను కలి­సి రా­జీ­నా­మా­లు ఆమో­దిం­చా­ల­ని స్ప­ష్టం చే­శా­రు. వై­ఎ­స్సా­ర్సీ­పీ తర­ఫున ఎమ్మె­ల్సీ­గా వెం­క­ట­ర­మణ గె­లు­పొం­దా­రు. 2024 నవం­బ­ర్‌­లో తాను ఇచ్చిన రా­జీ­నా­మా లే­ఖ­పై శా­స­న­మం­డ­లి ఛై­ర్మ­న్‌ మో­షే­ను­రా­జు ని­ర్ణ­యం తీ­సు­కో­లే­దం­టూ హై­కో­ర్టు­ను ఆయన ఆశ్ర­యిం­చా­రు.

Tags:    

Similar News