Telugu States: ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

Update: 2024-04-04 04:57 GMT

ఇంటర్ కాలేజీలకు ఏపీ ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. మే 31 వరకు సెలవులు ఉంటాయని.. జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభం అవుతాయని వెల్లడించింది. వేసవి సెలవుల్లో కాలేజీలు ఎలాంటి క్లాసులు నిర్వహించకూడదని స్పష్టం చేసింది. అలాగే షెడ్యూల్ విడుదల కాకపోయినా ప్రవేశాలు నిర్వహిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఇక ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 23న స్కూళ్లకు చివరి పనిదినంగా పేర్కొంది. ఈ లెక్కన విద్యార్థులకు దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. తిరిగి జూన్ 12న స్కూళ్లు పున: ప్రారంభమవుతాయని ఏపీ ప్రభుత్వం వెల్లడించింది.

ఇక అటు తెలంగాణలోని ఇంటర్మీడియట్‌ కాలేజీలకు ప్రభుత్వం వేసవి సెలవులను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. మార్చి 31వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు రాష్ట్రంలోని ఎయిడెడ్, ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించింది. మే 31 తర్వాతే కాలేజీలు ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

Tags:    

Similar News