Ap High Court : వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Ap High Court : వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైఎస్‌ఆర్ చేయూత పథకానికి అర్హులైన వారికి...రాజకీయకక్షతో నిలిపివేయడంపై విచారణ చేపట్టింది.;
AP High Court (tv5news.in)
Ap High Court : వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వైఎస్‌ఆర్ చేయూత పథకానికి అర్హులైన వారికి...రాజకీయకక్షతో నిలిపివేయడంపై విచారణ చేపట్టింది. తమకు పథకం అమలు చేయకపోవడంపై హైకోర్టును ఆశ్రయించారు పెదకూరపాడు మండలం, గారపాడు గ్రామస్థులు రామనాథం వసంత లక్ష్మితో పాటు మరో 26 మంది. గ్రామస్థుల తరపున న్యాయవాది అరుణ్ శౌరి వాదించారు.
వాలంటీర్లు ఏడుగురికి వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఈ సందర్భంగా..హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వాలంటీర్లకు ఉన్న సర్వీసు నిబంధనలు ఏంటని ప్రశ్నించింది. వాలంటీర్ అంటే స్వచ్ఛందం కదా ? డబ్బులు ఎలా ఇస్తారు ? అని ప్రశ్నించింది.పెన్షన్‌దారుల సొమ్ముతో వాలంటీర్ పరారీ, శ్రీకాకుళంలో సంఘటనల పై పత్రికల్లో వచ్చిన వార్తలను ప్రస్తావించారు హైకోర్టు న్యాయమూర్తి.
వాలంటీర్ తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారని, వాలంటీర్లు లబ్ధిదారుడిని ఎంపిక చేయడం ఏంటని ప్రశ్నించారు. లబ్ధిదారులను వాలంటీర్లు ఎంపిక చేస్తే సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది హైకోర్టు. పిటిషన్ వేయడంతో 26 మందికి చేయూత పథకం మంజూరైంది.