AP : టీడీపీ, జనసేన సభకు బస్సులు.. ఆర్టీసీకి ఓకే

Update: 2024-03-12 06:45 GMT

ఏపీలో సభలతో బలం నిరూపించుకునే ట్రెండ్ నడుస్తోంది. సిద్ధం సభలతో వైసీపీ బలం చూపిస్తే... రా కదలిరా సభలను మించి పవర్ చూపించుకునేందుకు కూటమి ప్రయత్నిస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలు ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కూటమి ఓకే అయిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి సభ కావడంతో పార్టీల శ్రేణులను తరలించేందుకు బస్సులు కావాలంటూ ఆర్టీసీకి లేఖ రాశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఆయన లేఖకు ఏపీఎస్‌ ఆర్టీసీ సమాధానం ఇచ్చింది. ఎన్ని బస్సులు కావాలో తెలపాలంటూ కబరు పంపింది.

బీజేపీ కూడా కలిసింది కాబట్టే.. ఆర్టీసీ ఓకే చెప్పిందనేది ఓ టాక్. ఏదేమైనా.. ఆర్టీసీ బస్సులను వాడి టీడీపీ, జనసేన, బీజేపీ జనాన్ని చిలకలూరిపేటకు తరలించే పనుల్లో బిజీ అయ్యాయి. గతంలో టీడీపీ, జనసేన నిర్వహించిన సభలకు బస్సులు కావాలంటూ ఆర్టీసీని కోరారు. అయితే.. అప్పుడు ఏపీఎస్‌ ఆర్టీసీ వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. దాంతో.. ఆర్టీసీ యాజమాన్యంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఓకే చెప్పడానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.

Tags:    

Similar News