సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి 80.66% పోలింగ్ నమోదు అయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ట్వీట్ చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ 1.07%ను కలిపితే మొత్తం పోలింగ్ 81.73%గా ఉండొచ్చని ప్రాథమిక అంచనా. పోస్టల్ బ్యాలెట్ కలుపుకొని 2014లో 78.90%, 2019లో 79.80% మేర పోలింగ్ నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఓటింగ్ జరగడం ఇదే తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో 72.63%, 2014లో 78.90%, 2019లో 79.80% మేర పోస్టల్ బ్యాలట్ కలిపి పోలింగ్ నమోదైంది. ఆ లెక్కన చూస్తే ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి 2009తో పోలిస్తే 9.74%, 2014తో పోలిస్తే 3.47%, 2019తో పోలిస్తే 2.57% మేర అధికంగా ఓటింగ్ జరిగింది.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం
*అల్లూరి- 70.20
*అనకాపల్లి- 83.84
*అనంతపురం- 79.25
*అన్నమయ్య- 76.23
*బాపట్ల- 84.98
*చిత్తూరు- 82.65
*డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ- 83.91
*ఈస్ట్ గోదావరి- 80.94
*ఏలూరు- 83.55
*గుంటూరు- 78.81
*కాకినాడ- 80.31
*కృష్ణా- 84.05
*కర్నూలు- 75.83
*నంద్యాల- 80.92
*ఎన్టీఆర్- 79.68
పల్నాడు- 85.65
*పార్వతీపురం- 77.10
*ప్రకాశం- 87.09
*నెల్లూరు- 78.10
*సత్యసాయి- 82.77
*శ్రీకాకుళం- 76.07
*తిరుపతి- 77.82
*విశాఖ- 68.63
*విజయనగరం- 81.34
*వెస్ట్ గోదావరి- 82.70
*వైఎస్సార్- 79.40