AP: ఆంధ్రప్రదేశ్లో కొత్తగా మూడు జిల్లాలు.!
కొత్త జిల్లాలు, సరిహద్దుల మార్పుపై కసరత్తు.. అసెంబ్లీ సమావేశాల నాటికే నిర్ణయాలు ?.. తుది కసరత్తు చేస్తున్న మంత్రుల సబ్ కమిటీ.. మండలాలు, గ్రామాల సర్దుబాట్లపై చర్చ
ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు వేగవంతమైంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలోపే ప్రభుత్వానికి నివేదికని ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోంది. ఆ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకొనుంది. అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని తెలుస్తోంది. రెండు మూడు జిల్లాల ఏర్పాటుతో పాటు కొన్ని చోట్ల హద్దులు మార్చే అవకాశం ఉందని సమాచారం. వైస్సార్సీపీ హాయాంలో పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు. అయితే, ఇందులోని గందరగోళం ఉందని మార్పులు అవసరమని భావించింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు మండలాలు గ్రామాల సరిహద్దులు పేర్ల మార్పు సర్దుబాట్లపై అధ్యయనానికి ఏడుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సబ్ కమిటీ ఇప్పటికే ప్రజలు ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను సేకరించింది. అంతేకాకుండా వినతలను కూడా స్వీకరించింది. వీటన్నిటిపై త్వరలో ఉపసంఘం చర్చించి అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వానికి నివేదికను ఇవ్వనుంది. అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉపసంఘం లక్ష్యంగా భావిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు మండలాలు, గ్రామాల సరిహద్దులు, పేర్ల మార్పులపై కూడా అధ్యయనం చేస్తున్నారు. దీనిపై తుది కసర్తుత జరుగుతోంది.
కొత్తగా మూడు జిల్లాలు...
ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, యర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాలతో మార్కాపురం కొత్త జిల్లాను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపితే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందంటున్నారు. ఈ రెండు నియోజకవర్గాలను ప్రకాశం జిల్లాలో కలిపితే ఒంగోలు, కొండపి, సంతనూతలపాడుతో కలిపి మొత్తం ఐదు నియోజకవర్గాలు అవుతాయి. దీనివల్ల రెండు జిల్లాలు సమానంగా ఉంటాయంటున్నారు. బాపట్ల జిల్లాలోని అద్దంకి నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజక వర్గాలని మళ్ళీ ప్రకాశం జిల్లాలో కలిపితే అక్కడి ప్రజలకు సౌకర్యంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది.. దాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇక అమరావతి కేంద్రంగా కొత్తగా అర్బన్ జిల్లా ఏర్పాటు ప్రతిపాదన కూడా ఉంది. రాజధాని పరిధిలోని 29 గ్రామాలు గుంటూరు జిల్లా మంగళగిరి, తాడికొండ నియోజక వర్గాల్లోకి వస్తాయి. వీటితో పాటు పెదకూరుపాడు, నందిగామ, జగ్గయపేట నియోజక వర్గాలు భౌగోళికంగా అమరావతికి దగ్గరగా ఉంటాయి. కొత్త అర్బన్ జిల్లా ఏర్పాటు చేస్తే ఐదు నియోజక వర్గాలు అయ్యే అవకాశం ఉంటుంది. గుంటూరు తూర్పు, పశ్చిమ, పత్తిపాడు, పొన్నూరు, తెనాలి కలిపి ఐదు నియోజక వర్గాలు అవుతాయి.