AP : అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్

Update: 2024-06-25 07:10 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ). ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందించే ప్రముఖ బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ను త్వరలో అమరావతిలో ఏర్పాటు చేస్తామని నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. ఆస్పత్రి నిర్మాణానికి గతంలోనే సీఎం చంద్రబాబు స్థలం కేటాయించారని, త్వరలోనే ఆసుపత్రిని నిర్మిస్తామని వివరించారు.

బసవతారకం హాస్పిటల్ సేవలను విస్తరించాలని నందమూరి కుటుంబం ఎప్పటినుంచో భావిస్తోంది. ఇప్పుడు సరైన సమయం రావడంతో.. నిర్ణయాన్ని అమలుచేసేందుకు సిద్ధమయ్యామని బాలకృష్ణ తెలిపారు. పేదలకు అండగా నాణ్యమైన సేవలు కొనసాగుతాయని తెలిపారు.

Tags:    

Similar News