Telugu States : ఏపీ ఎన్నికలపై.. తెలంగాణలో బెట్టింగ్‌..!

Update: 2024-05-11 07:32 GMT

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 13న తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్‌ జరగనుంది. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నప్పటికీ ఇక్కడంతా ఏపీ ఎన్నికలపైనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఓట్లు, ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ సారి ఎన్నికల్లో ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే అంశంపైనే చర్చ జరుగుతోంది.

అంతేకాదు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే అంశంపై ఏకంగా బెట్టింగ్‌లు వేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మల్కాజ్‌గిరి సహా రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లోని ఏపీ, తెలంగాణ ప్రజల్లో ఈ చర్చ మరింత ముదురుతోంది. ఎన్నికలకు మరో రెండు రోజులే సమయం ఉండడంతో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు ఎన్నికల వేళ మద్యం కోసం మందుబాబులు షాపుల వద్ద క్యూ కడుతున్నారు. ఓట్ల కోసం నేతలు డబ్బులు పంచడం, మద్యం అమ్మకాలపై ఈసీ ఆంక్షలు విధించడం, వైన్స్ షాపుల్లో స్టాక్ ఉండకపోవడం దీనికి కారణమని తెలుస్తోంది. నిన్న నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఓ వైన్ షాప్ వద్ద జనం ఇలా లైన్‌లో కనిపించారు. దీంతో మద్యం కోసం చూపే ఈ ఉత్సాహాన్ని ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చూపించాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News