ఏపీలో ఎక్కడ ఏం జరిగినా సరే అయితే కులానికి, లేదా పార్టీకి ఆపాదించడం వైసిపి పార్టీకి అలవాటు అయిపోయింది. ఒక వ్యక్తి తప్పు చేస్తే దాన్ని ఆ వ్యక్తికి చెందిన కులం మొత్తానికి ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్. ఒకవేళ ఆ వ్యక్తి ఏదైనా పార్టీలో ఉంటే ఆ పార్టీ మొత్తానికి అతను చేసిన నేరాన్ని అంటగట్టడం ఎంతవరకు కరెక్టు. ఈ విషయంలో వైసిపి ఎందుకు పదేపదే కులం పేరు లేకపోతే పార్టీ పేరు తీసుకువస్తోంది. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని కోరాలి. ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీ బాధ్యత అది. దాన్ని ఎవరూ కాదనరు. కానీ వైసీపీ పార్టీ ప్రతిదాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోంది. మొన్నటికి మొన్న కందుకూరు లో జరిగిన లక్ష్మీనాయుడు హత్యను కులానికి అంటగట్టి.. రెండు కులాల మధ్య చిచ్చు రేపడానికి వైసీపీ ప్రయత్నించింది.
తునిలో ఓ కీచకుడు మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేయడం ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఆదేశించింది. పోలీసులు కూడా వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని.. మైనర్ బాలికకు వైద్య పరీక్షలు కూడా చేయించారు. ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని వదిలే ప్రసక్తే లేదని పోలీసులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో నిందితుడి పై చాలా సీరియస్ గా వ్యవహరిస్తోంది. ఎక్కడ కూడా నిందితుడిపై సానుభూతి చూపించకుండా కఠినంగా వ్యవహరిస్తోంది. కానీ వైసీపీ సోషల్ మీడియా మాత్రం టిడిపికి చెందిన నేత ఇలా చేశాడు.. ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు ఎక్కువయ్యాయి అన్నట్టు రకరకాల ప్రచారాలు చేస్తోంది. ఈ ఉదంతాన్ని టిడిపి పార్టీకి అంటగట్టి బురదజల్లే ప్రయత్నం చేస్తోంది.
ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలని వైసీపీ డిమాండ్ చేయాలి. మైనర్ బాలిక తరపున వైసీపీ పోరాడాలి. అందులో ఒక అర్థం ఉంటుంది. దాన్ని ఎవరూ కాదనరు. కానీ అవేవీ చేయకుండా ఎంతసేపు కూటమి ప్రభుత్వంపై ఎలా బురద జలాలి.. ఎలా ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టాలి అనే కుట్రలు మాత్రమే చేస్తుంది. గతంలో వైసిపి నేతలపై ఇలాంటి కేసులు చాలానే నమోదు అయ్యాయి. కానీ ఆ టైంలో టిడిపి గానీ జనసేన గానీ ఇలాంటి పిచ్చి ప్రచారాలు చేయలేదు. కేవలం నిందితుడిని కఠినంగా శిక్షించాలని మాత్రమే డిమాండ్ చేశాయి. నిందితుడు ఏ పార్టీ అయినా ఏ కులమైనా వదిలిపెట్టకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని మాత్రమే కోరాయి. దాన్ని రాజకీయ నిబద్ధత అంటారు. కానీ ఇప్పుడు వైసీపీ చేస్తుంది ఏంటి.. ఇలా ఏపీలో ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని కులాలకు లేదా పార్టీలకు అంటగట్టడం.. ప్రజలను రెచ్చగొట్టి అశాంతి సృష్టించాలని చూడటం.. ఇలాంటి కుట్రలు వైసిపి మానుకుంటే చాలా బెటర్.