కుప్పంలో చంద్రబాబు బిజిబిజీ
టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంతనియోజకవర్గం కుప్పంలో బిజిబిజీగా గడుపుతున్నారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ రెండోరోజు రామకుప్పం మండల పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు;
TDP అధినేత చంద్రబాబు తన సొంతనియోజకవర్గం కుప్పంలో బిజిబిజీగా గడుపుతున్నారు. మూడ్రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ రెండోరోజు రామకుప్పం మండల పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. అంతకుముందు ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అక్కడి నుంచి బీసీఎన్ కల్యాణ మండపానికి చేరుకుని పార్టీ శ్రేణులతో భేటీ అవుతారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీల నుంచి భారీ స్థాయిలో చేరికలుంటాయి. డీసీసీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ సురేశ్‌బాబు సహా, పలువురు నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరనున్నారు.
తర్వాత ఆర్టీసీ బస్టాండు సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు, లక్ష మెజారిటీ లక్ష్యంగా ప్రచారం ప్రారంభిస్తారు. దీనికి ప్రత్యేకంగా తయారు చేసిన లోగోను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. అదేవిధంగా రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కుప్పం రూరల్, శాంతిపురం మండల పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం అవుతారు. రాత్రి 7గంటల 30నిమిషాల వరకు బెంగళూరు హాల్ ఎయిర్‌పోర్టు చేరుకుంటారు.
సీఎం జగన్ పాలన తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. కొండలు-గుట్టలు మింగేస్తున్నారని భగ్గుమన్నారు. డబ్బంతా దోచేసి విదేశాల్లో దాచిపెడుతున్నారని.. వైసీపీ నేతలు తిన్నదంతా కక్కిస్తామని పేర్కొన్నారు. వైసీపీది అవినీతి ప్రభుత్వమంటూ అమిత్‌షా, నడ్డానే చెప్పారని.. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు ఎప్పుడు తీసుకుంటుందని ప్రశ్నించారు.