సీఎం చంద్రబాబు నాయుడు ఎంత హుందాగా వ్యవహరిస్తుంటారో మనకు తెలిసిందే. ఆయన మీద ఎంత మంది ఎన్ని రకాలుగా కామెంట్లు చేసినా సరే ఆయన మాత్రం టెంప్ట్ కారు. తన హుందాతనాన్ని ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంటారు. ఇప్పుడు తెలంగాణ విషయంలోనూ ఇదే చేశారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ఇతర నేతలు ఎంతగా చంద్రబాబు మీద కామెంట్లు చేస్తున్నారో చూస్తున్నాం. ఏపీతో వివాదం అన్న రేంజ్ లో వాళ్ల మాటలు కనిపిస్తున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం అలా కాకుండా చాలా పెద్ద మనసులతోనే స్పందించారు. ఇవాళ ప్రపంచ తెలుగు తెలుగు మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాలు అత్యంత హుందాతనంతో కలిసి ఉండాలని కోరారు. ప్రపంచంలో తెలుగు రాష్ట్రాలు ఉన్నవి రెండే అని.. ఇలా నీటి కోసం కొట్టుకోవద్దని ఆకాంక్షించారు. తెలంగాణ, ఏపీ మధ్య విద్వేషం ఉండొద్దని.. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాలు అద్భుతంగా డెవలప్ కావాలన్నదే తన కల అని.. అందుకోసం ఏం చేయడానికైనా తాను సిద్ధమే అని మరోసారి ప్రకటించారు.
వాస్తవానికి చంద్రబాబు నాయుడు తనను అన్ని మాటలు అన్నా సరే ఇంత హుందాగా ప్రవర్తించాల్సిన అవసరం లేకపోయినా.. తెలుగు వారి ఖ్యాతి కోరుకునే వ్యక్తిగా ఆయన వ్యవహరించారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా తాను వారికి సహకరిస్తానని చెప్పారు. అంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాల నడుమ వివాదాన్ని అస్సలు కోరుకోవట్లేదని అర్థం అవుతోంది. న్యాయబద్ధంగా ఏపీకి ఎంత నీరు కావాలో అంత మాత్రమే వాడుకుంటానని చెప్పారు. గోదావరిలో ఎక్కువ నీరు ఉంది కాబట్టి తెలంగాణ వాడుకుంటే తనకేం అభ్యంతరం లేదన్నారు.
తాను ఇప్పటికే కాళేశ్వరంతో పాటు అనేక ప్రాజెక్టులకు సహకరించినట్టు వివరించారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకం కట్టడం వల్లే ఆ ప్రాజెక్టు తాను ఆపాల్సి వచ్చినట్టు తెలిపారు. చట్టబద్ధంగా ఉంటే తాను దేనికీ అడ్డు చెప్పబోనని.. అలా లేకుండా ఏపీకి చెందింది అయితే ఆపేస్తా అని ఆయన ఈ విధంగా నిరూపించుకున్నారు. ఈ విషయంలో చంద్రబాబు వ్యాఖ్యల పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. చంద్రబాబు లాంటి హుందాతనం వ్యవహరించే వ్యక్తి ఉన్నంత కాలం రెండు రాష్టరాల నడుమ వివాదాలు రాజుకునే ఛాన్స్ లేదని కూటమి నేతలు అంటున్నారు.