సీఎం చంద్రబాబు ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వినాయక్ నగర్‌లో మున్సిపల్ కార్మికుడి ఇంటికి వెళ్తారు. ZPHS వరకూ కాలినడకన ర్యాలీలో పాల్గొంటారు. పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి నిర్వహిస్తారు.
తనతో సమావేశానికి కొందరు ఎంపీలు హాజరుకాకపోవడంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ముఖ్యమైన భేటీకి రాకపోతే ఎలా అని ప్రశ్నించారు. వచ్చే సమావేశానికి ఇది రిపీట్ కాకూడదని చెప్పారు. జిల్లా అభివృద్ధి బాధ్యత ఎంపీ, ఇన్‌ఛార్జ్ మంత్రి, కలెక్టర్, జిల్లా మంత్రిదేనని స్పష్టం చేశారు. కొందరు ఎమ్మెల్యేలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, వారిని కంట్రోల్ చేసే బాధ్యత ఎంపీ, ఇన్‌ఛార్జ్ మంత్రులదేనని సీఎం తేల్చి చెప్పారు.
మరోవైపు ఏపీలో కొత్తగా 63 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే వీటి ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవనున్నారు. ఏ ప్రాంతాల్లో ప్రారంభిస్తారనే విషయమై ఈ నెలఖారులోగా క్లారిటీ వచ్చే అవకాశముంది. కూటమి ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15న అన్న క్యాంటీన్లను ప్రారంభించగా ప్రస్తుతం 203 అందుబాటులో ఉన్నాయి.