AP : గజ్జల వెంకటలక్ష్మికి సీఎం జగన్ కీలక పదవి

Update: 2024-03-16 04:46 GMT

మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా గజ్జల వెంకటలక్ష్మిని (Gajjala Venkatalakshmi) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాసిరెడ్డి పద్మ రాజీనామా చేయడంతో ప్రస్తుత మహిళా కమిషన్ సభ్యురాలైన లక్ష్మిని ఆ పదవిలో సీఎం జగన్ (CM Jagan) నియమించారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీతోనే ఉన్న ఆమె సేవలకు గుర్తుగా జగన్ ఈ పదవిని అప్పగించారు. తనకు పదవి ఇచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలిపిన లక్ష్మి.. ఈ బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని వెల్లడించారు.

జగన్‌కు అత్యంత నమ్మకమైన వైసీపీ నేతల్లో వాసిరెడ్డి పద్మ ఒకరు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెను మహిళా కమిషన్ చైర్‌పర్శన్‌గా చేశారు. వాసిరెడ్డి పద్మ 2019, ఆగస్టు 8న ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. అప్పటి వరకూ ఆ పదవిలో ఉన్న నన్నపనేని రాజకుమారి రాజీనామా చేయడంతో.. అధికార వైసీపీ వాసిరెడ్డి పద్మను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమిస్తూ జీఓ విడుదల చేసింది. అంతకుముందు ఆమె వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు.

Tags:    

Similar News