AP : నేడు ఐప్యాక్ కార్యాలయానికి సీఎం జగన్

Update: 2024-05-16 05:36 GMT

ఏపీ సీఎం జగన్ నేడు విజయవాడలోని ఎన్నికల వ్యూహ సంస్థ ఐప్యాక్ కార్యాలయాన్ని సందర్శించనున్నారు. బెంజ్ సర్కిల్‌లో ఉన్న ఆ సంస్థ ఆఫీసుకు మ.12 గంటలకు చేరుకుని అక్కడి ప్రతినిధులతో 30 నిమిషాల పాటు సమావేశం కానున్నారు. ఎన్నికల్లో వైసీపీ కోసం పని చేసినందుకు కృతజ్ఞతలు చెప్పడంతో పాటు కొన్ని బహుమతులూ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12.23కు అక్కడి నుంచి బయల్దేరి మధ్యాహ్నం 12.30 గంటలకు తాడేపల్లిలోని ఇంటికి చేరుకుంటారు. సీఎం జగన్ ఈ నెల 17న లండర్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే.. జూన్ 1న తిరిగి రాష్ట్రానికి వస్తారు.

బీహార్‌కు చెందిన ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్‌ను ప్రారంభించారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీ కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్నారు.. ప్రశాంత్ కిషోర్ తన స్ట్రాటజీలతో వైఎస్సార్‌సీపీ 2019లో అధికారంలో రావడానికి కీలకంగా వ్యవహరించారని చెబుతారు. 2019 ఎన్నికల సమయంలో కూడా వైఎస్ జగన్ ఆ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ సంస్థ నుంచి బయటకు వచ్చేశారు.. అయితే ఆసంస్థలో పనిచేస్తున్న కొందరు వైఎస్సార్‌సీపీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. అందుకే ఈసారి కూడా ఐప్యాక్ కార్యాలయానికి జగన్ వెళుతున్నారు.

Tags:    

Similar News