AP : టీడీపీలో సీనియర్లకు నిరాశ

Update: 2024-06-12 04:57 GMT

సీఎంగా చంద్రబాబు ( Chandrababu Naidu ) ఇవాళ ఉదయం 11.27కు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ), మరో 23 మంది మంత్రులతో గవర్నర్ జస్టిస్ నజీర్ ప్రమాణం చేయించనున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. పీఎం మోదీతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు ఇప్పటికే విజయవాడకు చేరుకున్నారు.

చంద్రబాబు నేతృత్వంలో 24 మందితో రాష్ట్ర కేబినెట్‌ కొలువుదీరనుంది. ఎనిమిది మంది బీసీలు, నలుగురు కమ్మ, నలుగురు కాపు, ముగ్గురు రెడ్లు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, మైనార్టీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి పదవి వరించింది. మొత్తంగా 17 మంది తొలిసారి మంత్రి పదవి చేపట్టనున్నారు. వీరిలో పది మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ముగ్గురు మహిళలకు చోటు దక్కింది.

అయితే మంత్రి పదవులు ఆశించిన పలువురు సీనియర్ నేతలకు నిరాశ ఎదురైంది. వారిలో బుచ్చయ్య చౌదరి, అయ్యన్న, ధూళిపాళ్ల నరేంద్ర, గంటా శ్రీనివాసరావు, యరపతినేని, బొండా ఉమ, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, GV ఆంజనేయులు తదితరులు ఉన్నారు. అలాగే JC అస్మిత్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచిన పల్లా శ్రీనివాసరావుకూ అవకాశం దక్కలేదు.

Tags:    

Similar News