తిరుపతిలో వైసీపీ నేతల అత్యుత్సాహం.. ఎన్నికలు జరగని డివిజన్‌లో తమదే గెలుపు అంటూ ప్రచారం..!
తిరుపతిలో వైసీపీ నేతల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎన్నికలు జరగని డివిజన్‌లో కూడా తమదే గెలుపు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.;
తిరుపతిలో వైసీపీ నేతల అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎన్నికలు జరగని డివిజన్‌లో కూడా తమదే గెలుపు అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తిరుపతి 7వ డివిజన్‌లో ఎన్నికలు జరగకపోయినా సరే... తమ అభ్యర్థిని గెలిచిందని ఫ్లెక్సీలు కట్టారు. దీంతో వైసీపీ నేతల తీరుపై టీడీపీ వర్గీయులు మండిపడుతున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని అంటున్నారు. ఇటీవల ఈ 7వ డివిజన్‌లో ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థి సంతకాన్ని వైసీపీ నాయకులు ఫోర్జరీ చేసి ఏకగ్రీవం చేసుకున్నారని ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతి 7వ డివిజన్‌లో ఎన్నికలు నిలిపివేయాలని ఎస్‌ఈసీ అదేశించడంతో... పోలింగ్ నిలిచిపోయింది. అయితే... వైసీపీ వర్గీయులు మాత్రం అత్యుత్సాహంతో గెలుపు తమదేనని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.