Fake Liquor Scam : నకిలీ మద్యం.. వైసీపీ చుట్టూ లింకులు.

Update: 2025-10-07 08:45 GMT

ఏపీలో వేల మంది ప్రాణాలు తీసుకున్న నకిలీ మద్యం కుంభకోణం వైసీపీ చుట్టూ తిరుగుతోంది. విచారణలో కొందరు టిడిపి నేతలు ఉన్నారని తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. వాళ్లని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి.. ప్రభుత్వ పరంగాను చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు ఎవరు చెడు చేసినా సరే ఊరుకునేది లేదని ఈ విధంగా మరోసారి నిరూపించారు. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న తంబళ్లపల్లి టిడిపి ఇన్చార్జిగా ఉన్న జయచంద్రా రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ములకల చెరువులో నకిలీ మద్యం కేంద్రం వైసిపి నేతకు చెందినదే అని తేలిపోయింది. ఈ జయచంద్రా రెడ్డి కూడా పేరుకే టిడిపి నేత అయినా.. ఆయన లింకులు అన్ని వైసీపీలోనే ఉన్నాయి. ఆయన గతంలో వైసిపి లీడర్ గా చలామణి అయ్యారు.

ఆ పరిచయాలతోనే వైసిపి టైంలో నకిలీ మద్యం తయారీలో పాలుపంచుకున్నారు. ఎంత పరిచయాలు లేకపోతే టిడిపి నేతగా ఉన్న ఆయనకు వైసిపి ప్రభుత్వం నుంచి సపోర్ట్ వస్తుంది. ఈయనే కాదు ఈయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ వైసీపీతో లింకులు ఉన్నవాళ్లే. టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ నకిలీ మద్యం కుంభకోణంపై చంద్రబాబు నాయుడు ఎన్నో పోరాటాలు చేశారు. ఎంతో మంది ప్రాణాలు తీస్తోందని ప్రచారం చేశారు. అయినా సరే చంద్రబాబు నాయుడు పోరాటానికి, ఆయన ఆదేశాలకు వ్యతిరేకంగా జయచంద్రా రెడ్డితో పాటు.. అతని పిఏ రాజేష్ ఈ దందాలో పాల్గొన్నారు. జనార్దన్ రావు, కొడాలి శ్రీనివాసరావు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. శ్రీనివాసరావు అరెస్ట్ అయితే తమ డొంక అంతా కదులుతుందని వైసిపి నేతలు వణికిపోతున్నారు.

అందుకే ఆయన అరెస్టు కాకుండా వైసిపి నేతలు ఫుల్లుగా సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ తప్పే చేయకపోతే ఈ విషయంలో జగన్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్లని ఎందుకు వెనకేసుకొస్తున్నాడు. పోలీసుల ముందుకు వచ్చి వీళ్ళందరూ తమ అభిప్రాయాలను, నిజాలను చెప్పొచ్చు కదా.. అలా చెప్పకుండా తప్పించుకునే తిరిగేందుకు ప్రయత్నిస్తున్నారంటే.. వాళ్ల తప్పులు ఏ స్థాయిలో ఉన్నాయో ఇట్టే అర్థం అయిపోతుందని కూటమినేతలో అంటున్నారు. ఇప్పటికే నకిలీ మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు వేగవంతంగా జరుగుతుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన ఈ భయంకర దందాకు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెక్ పెడుతుంది. ఈ దందాను వేర్ల నుంచి పీకేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు జరుపుతోంది.

Tags:    

Similar News