AP : విశాఖ ఎన్నికల బరిలో సీబీఐ మాజీ జేడీ..!

Update: 2024-03-22 07:26 GMT

కేసు దర్యాప్తులతో పాపులరైన ఐఏఎస్ ఆఫీసర్ లక్ష్మీనారాయణ. జగన్ (Jagan) సహా పలు అక్రమాస్తుల కేసులను డీల్ చేసిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ ఆయన. వాలంటరీ రిటైర్మెంట్ తో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన జనాల అభిమానం పొందారు కానీ.. ఇప్పటివరకు బ్రేక్ దక్కించుకోలేకపోయారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ చేస్తానని అదే పనిగా చెబుతూ వస్తున్నారు. కానీ హఠాత్తుగా ఎమ్మెల్యే సీటుకు ఫిక్సయ్యారు.

జేడీ లక్ష్మీనారాయణ ఆ పార్టీ ఈ పార్టీ తిరిగి చివరకు సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అంటున్నారు. ఉత్తర నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీనికి కారణం నియోజకవర్గంలో కాపు ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. వీరితో పాటు మేధావి వర్గం తనకు మద్దతు తెలుపుతోందని, గత ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసిన ఆయన ఉత్తర నియోజకవర్గం నుంచే ఓట్లు ఎక్కువ ఓట్లు పడ్డాయని ఆ ఓటు బ్యాంకు అలాగే ఉందని భావిస్తున్నారు.

విశాఖ ఉత్తర నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల 87 వేల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. అధికార వైసీపీ మాత్రం ఇంతవరకు బోణీ కొట్టలేదు. విశాఖ ఉత్తర నియోజకవర్గం లో అధికార వైసీపీ నుంచి కేకే రాజు ఎన్నికల బరిలో దిగగా… టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి నుంచి బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పోటీ చేస్తున్నారు. అనూహ్య రీతిలో వీవీ లక్ష్మీనారాయణ (Lakshminarayana) పోటీలో దిగారు. ఆయన గెలవడం పక్కనపెడితే.. ఎవరి ఓట్లు చీల్చి ఎవరి గెలుపుఓటములకు కారణం అవుతారన్నది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News