Andhra Pradesh : ఏపీలో ఫ్రీ బస్సు స్కీమ్.. నమూన టికెట్ వైరల్

Update: 2025-07-31 07:30 GMT

తెలంగాణలో ఫ్రీ బస్ స్కీమ్ విజయవంతంగా కొనసాగుతుంది. ఎన్నికల సమయంలో ఏపీలోనూ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఇప్పుడు ఆ హామీని అమలు చేసే అంశంపై ఫోకస్ పెట్టింది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ అమలుచేయనుంది. దీనికి సంబంధించి నమూనా టికెట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏపీ రోడ్డు రవాణా సంస్థ, డిపో పేరు, స్త్రీశక్తి ప్రయాణించే ప్రదేశం, చేరాల్సిన గమ్యస్థానం వంటి అంశాల్ని ఆ టికెట్‌పై ఉన్నాయి. మొత్తం టికెట్‌ ధర, ప్రభుత్వ రాయితీ, చెల్లించవలసింది రూ.0.00గా ముద్రించారు. ఈ టికెట్ ఫొటోపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News