ఓసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టడమే గొప్ప. రెండుమూడు సార్లు పోటీ చేసి గెలిస్తే మరింత గొప్పగా చెప్పుకుంటాం. అలాకాకుండా నాలుగైదారు సార్లు గెలిచి గోదావరి జిల్లాల్లో రికార్డు సృష్టించిన వారు పలువురున్నారు. ఆ రికార్డులన్నింటిని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి బ్రేక్ చేసేశారు.
ఒకే నియోజకవర్గం నుంచి ఏడోసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు గోరంట్ల. 78 ఏళ్ళ గోరంట్ల తాజా ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్ధిగా 64,090 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన గెలుపు చూసి రాజకీయ దురంధరుడు అంటే ఇలాగే ఉంటాడంటూ విశ్లేషణలు వినిపిస్తున్నాయి.