Hero Shivaji : హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు..!
Hero Shivaji : వైసీపీలోని 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో శివాజీ.;
Hero Shivaji : వైసీపీలోని 49 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో శివాజీ. మందడం రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. హైకోర్టు తీర్పు హర్షణీయమన్నారు. ఈ కాలంలో కూడా కులం గురించి ఎందుకు మాట్లాడుతున్నారని వైసీపీ టార్గెట్‌గా నిప్పులు చెరిగారు. వ్యాపారస్తులు రాజకీయాల్లోకి రావడం వల్లే అమరావతికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా గురించి సీఎం మాట్లాడిన మాటలు చాలా దారుణంగా ఉన్నాయన్నారు. ఇక్కడ చేపల కొట్లు, జొమాటో.. ఇవా మనకి ఉద్యోగాలని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు, అమరావతి అభివృద్ధి, ప్రత్యేక హోదా ఏమైంది అని ఇక సోసల్ మీడియాలో ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.