Gudlavalleru : బాలికల హాస్టల్‌లో హిడెన్ కెమెరాలు.. గుడ్లవల్లేరులో ఉద్రిక్తత

Update: 2024-08-30 09:15 GMT

కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరులో అర్ధరాత్రి ఉత్రిక్తత నెలకొంది. ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశారని విద్యార్థినిలు ఆందోళన చేపట్టారు. బాలికల హాస్టల్ వాష్‌రూమ్‌లలో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ధర్నా చేపట్టారు. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు. విజయ్ అనే విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విజయ్ ల్యాప్ టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వారం క్రితమే వెలుగుచూసినా కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

Tags:    

Similar News