వైసీపీ కార్యాలయాల ( YSRCP Office ) కూల్చివేత విషయంలో తొందరపాటు వద్దని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. స్టేటస్ కో కొనసాగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఇచ్చే వివరణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు భావించింది. అధికారులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సూచించింది.
ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగితే తప్ప.. ఎటువంటి చర్యలు తీసుకోవద్దని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. భవనాలకు అనుమతులకు సంబంధించిన పత్రాలను అన్నీ రెండు వారాల్లో సమర్పించాలని వైసీపీ తరఫున పిటిషనర్లకు సూచించింది. సంబంధిత అన్నిశాఖల అధికారులు తప్పనిసరిగా హైకోర్టు నిబంధనలు అనుసరించాలని సూచించింది.