Rain Alert in Telugu States : నైరుతి రుతుపవనాల ప్రభావం.. ఏపీ, తెలంగాణలో వర్షాలు

Update: 2024-06-07 05:27 GMT

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈరోజు ఏపీ ( Andhra Pradesh ), తెలంగాణలో ( Telangana ) వర్షాలు కురుస్తాయని ఇరురాష్ట్రాల వాతావరణ శాఖలు వెల్లడించాయి. ఏపీలో ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నాయి. రాయలసీమ జిల్లాలతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, విజయ నగరం, విశాఖలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించాయి.

నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మరింత అడ్వాన్స్​ అయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణాది జిల్లాల్లో పూర్తిగా విస్తరించడంతో పాటు ఉత్తర తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు ప్రవేశించినట్టు పేర్కొంది. పదో తేదీన రాష్ట్రంలోకి వస్తాయని అంచనా వేసినా.. వారం రోజుల ముందుగానే (ఈనెల 3న) రాష్ట్రంలోకి రుతుపవనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రుతుపవనాల విస్తరణ కూడా వేగంగా జరుగుతున్నట్టు అధికారులు చెప్తున్నారు.

Tags:    

Similar News