AP : ఏపీలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఫస్టియర్ కు ఈ నెల 19 వరకు, సెకండియర్ కు 20వ తేదీ వరకు జరుగుతాయి. ఉదయం9 గంటల నుంచి మద్యాహ్నం12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. విద్యార్థులు ఉ.8.45లోపు పరీక్ష కేంద్రంలో ఉండాలి. హాల్ టికెట్ మినహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లరాదు. కాగా ప్రశ్నాపత్రం ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే తెలిసిపోయేలా ప్రభుత్వం క్యూఆర్ కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది.
ప్రశ్నపత్రాలకు మూడు దశల్లో క్యూ ఆర్ కోడ్ ను జత చేశారు. ప్రశ్నాపత్రాలను ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే తెలిసేలా చర్యలు తీసుకున్నారు. దివ్యాంగులకు పరీక్ష రాసేందుకు సహాయకులను కూడా అందుబాటులో ఉంచినట్లు సౌరభ్ గౌర్ పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానుండగా, వారిలో మొదటి సంవత్సరం 4,73,058 మంది, రెండో సంవత్సరం 5,79,163 మంది ఉన్నారు.
మొత్తం 26 జిల్లాల్లో 1,559 సెంటర్లను సిద్ధం చేశారు. పరీక్షల పర్యవేక్షణకు 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 60 సిట్టింగ్ స్క్వాడ్స్‌ను బోర్డు నియమించింది. పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. కాబట్టి విద్యార్థులు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి.