వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.. టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి కేకేడీ వర్మ. కాకినాడ SEZ భూముల పై సిబిఐ, ఈడి విచారణ కోరుతున్న వైసీపీ నేతలు.. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా సిబిఐ ఎంక్వైరీ కి సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. రైతులను నిలువునా ముంచి, లేని పరిశ్రమలను చూపించి భూములు దోచుకున్న జగన్ అన్ని విచారణలకు సిద్ధంగా ఉండాలన్నారు వర్మ. కాకినాడ SEZ భూములపై తాము అన్ని పత్రాలతో సిద్ధంగా ఉన్నామని పిఠాపురం నడిబొడ్డున చర్చకు వైసీపీ నేతలు రావాలని చాలెంజ్ చేశారు వర్మ.