Kodali Nani: మంత్రి పదవి వెంట్రుక ముక్కతో సమానం- కొడాలినాని
Kodali Nani: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు.;
Kodali Nani (tv5news.in)
Kodali Nani: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి వెంట్రకతో సమానం అన్నారు. గుడివాడ ఎమ్మెల్యేగా ఉండటమే తనకు ఇష్టమని.. మాజీ మంత్రి అని పిలవద్దన్నారు. గుడివాడ మండలం దొండపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత నియోజకవర్గానికి తొలిసారి వచ్చిన నానికి వైసీపీ శ్రేణులు స్వాగతం పలికారు. మంత్రి పదవి వెంట్రుక ముక్కతో సమానమని.. ఎమ్మెల్యే పదవి పోతే బాధపడుతా అన్నారు. ఇక నుంచి తనను మాజీ మంత్రి అని పిలువకూడదన్నారు.