AP : పవన్ కళ్యాణ్ స్పెషల్ ఆఫీసర్‌గా కృష్ణజేజ.. బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

Update: 2024-06-22 10:12 GMT

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) ఓఎల్డీగా యువ ఐఏఎస్ అధికారి కృష్ణతేజ ( Krishna Teja ) నియమితులయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ( CM Chandrababu ) ప్రత్యేక అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కృష్ణతేజ స్వస్థలం పల్నాడు జిల్లా చిలకలూరిపేట. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆయన నియామకం కోసం చంద్రబాబు ప్రత్యేక అనుమతిని కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. బాలల హక్కుల సంరక్షణలో త్రిసూరు టాప్ లో నిలిపారు కృష్ణతేజ.

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా యువ ఐఏఎస్ అధికారి మైలవరపు వీఆర్ కృష్ణతేజ రానున్నారు. సాధారణంగా ఆర్డీఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎసీలుగా నియమిస్తారు. కానీ పవన్ కల్యాణ్ కోసం ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ నియామకానికి సీఎం.. చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. ఆయనను డిప్యూటేషన్ పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కృష్ణతేజ గతంలో కేరళ పర్యాటకాభి వృద్ధి సంస్థ ఎండీ, పర్యాటకశాఖ డైరెక్టర్, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్, అలప్పుజ జిల్లా కలెక్టర్గా సేవలందించారు.

మూడు రోజుల క్రితం కృష్ణతేజ పవన్ కళ్యాణ్ ను కలిసి వెళ్లారు. త్రిసూర్ జిల్లా కలెక్టర్ గా కృష్ణతేజ అందించిన సేవలకు గాను జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనను పురస్కారానికి ఎంపిక చేసింది.

బాలల హక్కుల రక్షణలో త్రిసూర్ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ.. 2029లో మార్చిలో కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి, దాతల సహకారంతో ఉన్నత చదువులకు చేయూత అందించారు. కరోనా సమయంలో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇళ్లు నిర్మించడంతో పాటు 150 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఐఏఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేస్తున్నారు.

Tags:    

Similar News