AP Cabinet : ఏపీ కొత్త క్యాబినెట్ లో 10 మంది పాత మంత్రులు కొనసాగే అవకాశం?
AP Cabinet : ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ విషయంలో అనూహ్యంగా మళ్లీ కొత్త ఫార్ములా తెరపైకి వచ్చినట్టు కనిపిస్తోంది.;
AP Cabinet : ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ విషయంలో అనూహ్యంగా మళ్లీ కొత్త ఫార్ములా తెరపైకి వచ్చినట్టు కనిపిస్తోంది. 10 మంది వరకూ పాత మంత్రులు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బొత్స, పెద్దిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, బాలినేనితోపాటు తానేటి వనితకు మరో ఛాన్స్ ఇస్తారంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే ఆదిమూలపు సురేష్, జయరాం, సీదిరి అప్పలరాజుతోపాటు చెల్లుబోయిన వేణుకు బెర్త్ కన్ఫామ్ అంటున్నారు. సీనియర్ల అసంతృప్తి కారణంగానే జగన్ వ్యూహం మార్చుకున్నట్టు తెలుస్తోంది. పాత వాళ్లలో 10 మంది వరకూ తిరిగి కేబినెట్‌లోకి వస్తే.. కొత్తగా 14 నుంచి 1 5 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది.