లోకేశ్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలంటూ వరుసబెట్టి టీడీపీ నేతలు డిమాండ్ చేయడం ఏపీలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ అంశం జనసేనలో ప్రకంపనలు పుట్టించింది. ఇలా వ్యాఖ్యలు చేస్తున్నవారిపై టీడీపీ అధిష్ఠానం అగ్రనేతలు కూడా సీరియస్ గా స్పందించారు. ఇలాంటి డిమాండ్లు చేయొద్దన్నారు. దావాస్ లో ఉన్న లోకేశ్ ను ఇదే అంశంపై ఓ జాతీయ మీడియా ఛానల్ ప్రశ్న అడిగింది. లోకేశ్ డిప్యూటీ సీఎం వార్తలపై స్పందించాలని అడగడంతో.. లోకేశ్ ఆ ప్రశ్నను తేలిగ్గా తీసుకున్నారు. తాను రాజకీయంగా మంచి పొజిషన్ లో ఉన్నానని చేతినిండా చంద్రబాబు పని అప్పగించారని లోకేశ్ చెప్పారు. ఏపీలో విద్య వ్యవస్థను రూల్ మోడల్ చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నానని చెప్పారు.