మంత్రి నారా లోకేష్ తనకు ఇచ్చిన మినిస్టర్ల శాఖల్లో అన్నింటినీ సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఐటీ, ఎడ్యుకేషన్ లో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ విద్య, ఉద్యోగాల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయన యువగళం పాదయాత్రలో కర్నూలులో వసల కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు. కర్నూలులో ప్రతి ఏడాది నిరుపేదలు వలస వెళ్తుంటారు. వైసీపీ హయాంలో ఈ ప్రాంతం నుంచి బతుకుదెరువు కోసమే వలసలు వెళ్లేవారు. పైగా అప్పటి వైసీపీ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్లకు టీచర్లను కేటాయించలేదు.
దీంతో వలస కూలీలు తమ పిల్లలను కూడా తమ వెంట వలసలకు తీసుకెళ్లేవారు. కానీ లోకేష్ ఎప్పుడైతే వాళ్ల సమస్యలను విన్నారో.. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించారు. అందులో ఎక్కువ మంది టీచర్లను కర్నూలు ఉమ్మడి జిల్లాకే కేటాయించారు. ఆదోనీ ప్రాంతంలోని చాలా స్కూళ్లు టీచర్లు లేక వైసీపీ హయాంలో మూతపడ్డాయి. వాటికి ఇప్పుడు లోకేష్ టీచర్లను కేటాయించారు. దీంతో వలస వెళ్లే కార్మికులు తమ పిల్లలను తిరిగి స్కూళ్లకు పంపిస్తున్నారు. వైసీపీ పాలనకు, ఇప్పుడు కూటమి పాలనకు పోల్చి చూస్తే స్టూడెంట్ల డ్రాపౌట్లు చాలా వరకు తగ్గిపోయాయి. ఇదంతా నారా లోకేష్ వల్లే జరిగిందని అంటున్నారు కార్మికులు.
పైగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ వలస కార్మికుల కోసం చాలా రకాల చర్యలు తీసుకుంటున్నారు. కర్నూలులోనే ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలను పెట్టుబడులు పెట్టేలా చేశారు లోకేష్. దీంతో ఇక్కడి కార్మికులకు చాలా రకాల పనులు ఇక్కడే దొరుకుతున్నాయి. దీంతో ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడే బయటి ప్రాంతాలకు అది కూడా అధిక కూలీ కోసమే వలసలు వెళ్తున్నారు. అలా వెళ్లే సమయంలో తమ పిల్లలను పెద్దవారి వద్దే ఉంచేసి వెళ్తున్నారు. ఇదంతా నారా లోకేష్ వల్లే వచ్చిన మార్పు అని చెబుతున్నారు స్థానికంగా ఉంటున్న ప్రజలు. అయితే ఈ వలసలను పూర్తిగా తగ్గించేందుకు నారా లోకేష్ మరిన్ని చర్యలు తీసుకుంటున్నారు. నీటి వసతులను మరింత పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.