Minister Gottipati Ravikumar : కూటమి సర్కార్‌పై విష ప్రచారమే వైసీపీ పని

Update: 2025-08-25 14:15 GMT

కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా విమర్శించారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని ఆయన స్పష్టం చేశారు. 'సూపర్ సిక్స్' పథకాలను అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

గతంలో ఒక్క అవకాశం అంటూ ఆచరణ సాధ్యం కాని హామీలతో జగన్ అధికారంలోకి వచ్చారని, ఆ తర్వాత మాట తప్పి మడమ తిప్పారని మంత్రి ధ్వజమెత్తారు. జగన్ పాలన కారణంగా దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిపై అక్కసుతో ఐదేళ్లపాటు రాజధానిని అభివృద్ధి చేయకపోగా, విధ్వంసం చేశారని మండిపడ్డారు. అదే ద్వేషంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై అసత్యాలతో విష ప్రచారం చేస్తున్నారని గొట్టిపాటి రవికుమార్ దుయ్యబట్టారు.

Tags:    

Similar News