Andhra Pradesh : రాష్ట్రంలో జగన్ అరాచకాలకు పాల్పడుతున్నాడు - మంత్రి రాంప్రసాద్ రెడ్డి
వైసీపీ నేతలు ఎక్కడికి వెళ్లిన ప్రజలను రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ అరాచకాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. రాయచోటిలో మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైసీపీకి మహిళల ఓట్లే ముఖ్యం కానీ.. వారిని గౌరవించడం చేతకాదని విమర్శించారు. ఈనెల 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 1400 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని.. మరో 1500 విద్యుత్ బస్సుల కొనుగోలుకు టెండర్లు పిలవబోతున్నట్లు వెల్లడించారు. మహిళా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా బస్టాండ్లలో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నామని వివరించారు.
కొత్తగా 1.9 లక్షల మందికి వితంతు పింఛన్లు - మంత్రి స్వామి
ఏపీలో కొత్తగా 1.9 లక్షల మందికి వితంతు పింఛన్లు ఇచ్చినట్లు మంత్రి డీబీవీ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో లబ్ధిదారులకు పింఛన్లను ఆయన అందజేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏ ఒక్క వితంతు మహిళకు పింఛన్ ఇవ్వలేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో 2 నెలల పింఛన్ తీసుకోకపోయినా మూడో నెలలో అన్నీ కలిపి ఇస్తున్నట్లు చెప్పారు. వైసీపీ అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు.