Minister Roja: ఎన్టీఆర్ జయంతిని నిర్వహించే అర్హత చంద్రబాబుకు లేదు: రోజా
Minister Roja: సీఎం జగన్‌ను తిట్టేందుకే టీడీపీ మహానాడు నిర్వహించారని మంత్రి రోజా మండిపడ్డారు.;
Minister Roja: సీఎం జగన్‌ను తిట్టేందుకే టీడీపీ మహానాడు నిర్వహించారని మంత్రి రోజా మండిపడ్డారు. ఎన్టీఆర్ జయంతిని నిర్వహించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. నారా లోకేష్, అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై విమర్శలు చేసిన మంత్రి రోజా.. రాజకీయ లబ్ది కోసమే కోనసీమలో అలజడి సృష్టించారని ఆరోపించారు. కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలా వద్దా అని టీడీపీ చెప్పాలని రోజా డిమాండ్ చేశారు.