ఏపీలో వైసీపీ హయాంలో పెట్టిన అన్ని ప్రభుత్వ పథకాల పేర్లను టీడీపీ ప్రభుత్వం మార్చింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాలతో అధికారులు ఉత్తర్వులిచ్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు-చంద్రన్న పెళ్లి కానుక, వైఎస్సార్ విద్యోన్నతి- ఎన్టీఆర్ విద్యోన్నతి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన- పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, జగనన్న విదేశీ విద్యాదీవెన-అంబేడ్కర్ ఓవర్‌సీస్ విద్యా నిధిగా పేర్లు మార్చింది.
మారిన పథకాల పేర్లు ఇవే..
➤ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనల పథకాల పేర్లను ‘పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్’గా మార్పు.
➤ ఎస్సీలకు అమలవుతున్న జగనన్న విద్యాదీవెన పథకం పేరును ‘అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి’గా మార్పు.
➤ వైఎస్సార్ కళ్యాణ మస్తు పేరును ‘చంద్రన్న పెళ్లి కానుక’గా మార్పు.
➤ వైఎస్సార్ విద్యోన్నతి పథకం పేరును ‘ఎన్టీఆర్ విద్యోన్నతి’గా మార్పు.
➤ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును ‘సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రొత్సాహాకాలు’గా మార్పు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ హయాంలో అమలైన పలు పథకాల పేర్లను మార్చేసింది. జగనన్న, వైఎస్ఆర్ పేర్లతో స్కీమ్స్ అమలు చేసింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో మళ్లీ పాత పేర్లనే తీసుకొస్తూ సాంఘిక సంక్షేమ శాఖ జీవో విడుదల చేసింది. ఆ మేరకు వెబ్‌సైట్లు, ఇతర చోట్ల మార్పులు చేయాలని ఆదేశించింది.