LOKESH: వైసీపీ ఓ మునిగిపోయే పడవ
జగన్ టికెట్లు ఇస్తామంటే నేతలు పారిపోతున్నారు... రెడ్ బుక్ చూస్తే అంత భయం ఎందుకున్న లోకేశ్;
వైసీపీ మునిగిపోయే పడవ అని ఆ పార్టీ నేతలూ తెలుసుకున్నారని అందుకే పిలిచి సీటు ఇస్తామన్నా దణ్ణం పెట్టి పారిపోతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఓటమి భయం పట్టుకునే జగన్ ఇష్టానుసారం అభ్యర్థులను మార్చుతున్నారన్నారు. బీసీలు, ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఎత్తివేస్తామని జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని... ఇప్పుడు ఇచ్చే వాటికన్నా రెట్టింపు సంక్షేమ పథకాలు అందిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రలో శంఖారావం యాత్రలో పాల్గొన్న అయన... ఎస్.కోట, పెందుర్తి సభల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం తీసుకొచ్చిన సూపర్ సిక్స్ మేనిఫెస్టో చూసి జగన్ భయపడిపోతున్నారని... అందుకే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలే నమ్మకపోవడంతో జగన్‌కు ఏం పాలుపోవడం లేదన్నారు.
జగన్ దారిలోనే ఆయన ఎమ్మెల్యేలు నడుస్తున్నారని లోకేశ్ మండిపడ్డారు. ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ కబ్జాలు చేస్తున్నారని విమర్శించారు. చివరకు రైతుల పొలాలను సైతం లాక్కుని ఎస్.కోట ఎమ్మెల్యే 50 కోట్లలో ఇల్లు నిర్మించుకున్నారని విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఉత్తరాంధ్రను అభివృద్ధిపథంలో పరుగులు పెట్టిస్తామన్నారు. విశాఖకు పెద్దఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అభయమిచ్చారు. తెలుగుదేశం-జనసేన అధికారానికి వస్తే... ప్రస్తుతం ఇస్తున్న వాటికి రెట్టింపు సంక్షేమ పథకాలు అందిస్తామని..... లోకేశ్ హామీ ఇచ్చారు.సొంతపార్టీ ఎమ్మెల్యేలే నమ్మకపోవడంతో జగన్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల కన్నీరు నుంచి బాబు సూపర్ 6 మేనిఫెస్టో వచ్చిందని లోకేష్ అన్నారు. దీనిని చూసి జగన్ భయపడుతున్నారు. క్రికెటర్ వైసీపీలోకి వస్తే ఎంతిస్తావని అతడిని అడిగారు. జగన్‌కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే ఎమ్మెల్యేలను మార్చుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలనే మార్చారు. జగన్ పాలనలో ముమ్మాటికీ జరిగింది సామాజిక అన్యాయమే. బీసీలంటే జగన్‌కు చిన్నచూపని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రావాల్సిన 10 శాతం రిజర్వేషన్‌ను కూడా ఇవ్వలేదు. ఎర్ర బుక్ చూసి కూడా జగన్ వణికిపోతున్నారు. ఆయన కటింగ్.. ఫిటింగ్ మాస్టర్. పచ్చ బటన్ నొక్కి రూ.10 వేసి.. ఎర్ర బటన్ నొక్కి రూ.100 లాగుతున్నారు. త్వరలో గాలిపై కూడా పన్ను వేస్తారేమో. వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక సీఎం జగన్ అని లోకేశ్ మండిపడ్డారు.