Nara Lokesh: మా రాముడు చంద్రబాబు నాయుడు, రాక్షసుడు జగన్ మెహన్ రెడ్డి- లోకేష్
Nara Lokesh: టీడీపీ స్థాపించి నాలుగు దశాబ్దాలు అయ్యాయని గుర్తుచేసుకున్న లోకేష్;
Nara Lokesh: మహానాడు వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గర్జించారు. వైసీపీ పాలన, సీఎం జగన్ తీరుపై పంచ్ డైలాగులతో సూటిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత నాలుగైదు రోజులుగా మహానాడు కార్యక్రమంలో నిమగ్నమై, టీడీపీ శ్రేణులతో వరుసగా మాట్లాడటంతో గొంతు బొంగుర పోయింది. అయినా ఆశేషంగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లను తన ప్రసంగంతో ఉత్సాహం, ధైర్యం నింపారు. జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు.
వైఎస్సార్సీపీ అంటే యువజన శృంగార రౌడీ పార్టీ అని లోకేష్ ఆరోపించారు. చంద్రబాబును రాముడుతో పోల్చిన ఆయన.. జగన్‌ను రాక్షసుడుగా అభివర్ణించారు. రాముడు రాష్ట్రాన్ని నిర్మాణం చేస్తే రాక్షసుడు ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. కూల్చివేతలతో మొదలుపెట్టిన జగన్.. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. శవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే పార్టీ వైసీపీ అని ధ్వజమెత్తారు. ఒక్క ఛాన్స్ అంటూ యువతను, ఆడబిడ్డల్ని జగన్ మోసం చేశారని నారా లోకేష్ అన్నారు.