గత ఎన్నికల్లో ఓటమి పాలైన నారా లోకేశ్ ఈసారి భారీ విజయం సాధించారు. తన తండ్రి చంద్రబాబు మెజార్టీని తలదన్నేలా.. ఏకంగా 90,160 మెజార్టీతో రికార్డు సృష్టించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. చంద్రబాబుకి 47,340 ఓట్ల మెజార్టీ దక్కింది. కుప్పంలో 1989లో చంద్రబాబు తొలిసారి గెలిచినప్పుడు అత్యధికంగా 71,607 మెజార్టీ సాధించారు. ఆ తర్వాత నుంచి మెజార్టీ తగ్గుతూ వస్తోంది. 2009 నుంచి ఆయన మెజార్టీ 45వేల మార్కు దగ్గరే ఉంటోంది. గత ఎన్నికల్లో మంగళగిరిలో ఓటమి పాలైన లోకేశ్.. ఈసారి అదే స్థానం నుంచి 91వేల ఓట్లకు పైగా మెజారిటీతో జయకేతనం ఎగరేశారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయనతో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా హస్తిన వెళ్లే అవకాశం ఉంది. వీరు బీజేపీ నిర్వహించే ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరవుతారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీల మద్దతును బీజేపీ కూడగట్టనుంది. అటు సీఎంగా తన ప్రమాణ స్వీకారానికి మోదీతో పాటు బీజేపీ అగ్రనేతలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
అటు నటసింహం నందమూరి బాలకృష్ణ వరుసగా మూడుసార్లు హిందూపూరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఆయన అల్లుళ్లు కూడా అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. పెద్దల్లుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి నుంచి ఏకంగా 90వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. చిన్న అల్లుడు శ్రీభరత్ 5లక్షలకు పైగా మెజారిటీతో విశాఖ ఎంపీగా గెలుపొందడం విశేషం.