AP : పీలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు

Update: 2025-02-12 17:00 GMT

రైతులకు ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. భూములు రీసర్వే జరిగిన 8,680 గ్రామాల్లో గతంలో ఇచ్చిన పాసు పుస్తకాలను వెనక్కి తీసుకొని ‘ఆంధ్రప్రదేశ్ రాజముద్ర’ ఉన్న వాటిని ఇవ్వనున్నారు. పాసు పుస్తకాలపై జగన్ బొమ్మ ఉండటంతో రైతులు తిరస్కరిస్తున్నారని మంత్రి అనగాని సీఎం చంద్రబాబుకు తెలిపారు. అలాగే సర్వేరాళ్లపై జగన్ బొమ్మలు, పేర్లు కూడా మార్చి నాటికి తొలగిస్తామన్నారు.

రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ పలు విభాగాల్లోని బకాయిలు చెల్లిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.22,507 కోట్లు తీర్చేసినట్లు తెలిపారు. కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల ఆలస్యంపై స్పందిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఒకటో తేదీన జీతాలు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించారు. త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు.

మరోవైపు చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నాగరిక సమాజంలో హింసకు తావులేదని హితవు పలికారు. గౌరవప్రదమైన చర్చలు, భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాలి కానీ హింసకు కాదని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల రంగరాజన్‌పై దాడిని టీజీ సీఎం రేవంత్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ తదితర రాజకీయ ప్రముఖులు ఖండించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News