కాకినాడ జిల్లా పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ SVSN వర్మ సంచలన కామెంట్స్ చేశారు. ఓ తెలుగు టీవీ ఛానల్ డిబేట్‌లో ఆత్మసాక్షి సర్వేకు తాను విసిరిన సవాల్‌కు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 50 వేల నుంచి 60 వేల మెజారిటీతో గెలవడం ఖాయమన్నారు.
దాదాపు 35 సర్వే సంస్థలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయని గుర్తు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని పాదగయలో పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు నిర్వహించిన యాగంలో వర్మ పాల్గొన్నారు.